Posted on 24 Jun, 2019 03:42 pm by MANTRI PRAGADA MARKANDEYULU (Mantri Marku)

Likes - 0 563


దమ్ములేని జీవితం © - Telugu Song

దమ్ములేని జీవితం © Copy Right Song

 

మాయలున్న మచ్చలేని

మరులుగొలుపు, సిరులు గొలుపు

మమతలేని మనసులేని

హృదయమే ఒక విచిత్రము.// బాబూ కనరా!వినరా!//

 

స్వార్థ జీవనం సంబరమంటు

వంచనభావం అంబరమంటె

నిర్మలభావం నింగిని కలసి

నిశ్ఛల తత్త్వం నీటిని కలసె//బాబూ//

 

ఊహలలోకంలో

ఆశలతీరంలో

నిశ్శబ్దపు నడి సంద్రంలో

సుడిగుండాల వలయంలో//బాబూ//

 

మాటలే వరాల మూటలు

బాటలే పొలాల తోటలు

బీటలు పడే మనుజుల మనసులు

కాటేసే కాంట్రాక్టులు, కళాత్మక చేష్టలు//బాబూ//

 

దమ్ములేని జీవితపుటడుగులు

పనికిరాని అవకతవకల నడకలు

దరిదాపుల్లో లేని సంస్కారజీవనం

దారిద్ర్యమై వెలసే తెలుగు తేజం//బాబూ//

 

 

దానగుణములేని రాజ్యం

ధీరగుణములేని పాలనలో

బ్రతుకు సాగే గుండె బరువుతో

కాలం సాగే రాహు కేతువులతో//బాబూ//

 

ఆసక్తిరహిత, బ్రతుకు వేదన వేదాంతంతో

చిగురించని చిన్నారి చదువులలో

అమాయకుల నిస్సహాయ చూపులలో

సుడిగుండమాయె నిర్జీవన జీవన రేఖలు//బాబూ/

________________________

MANTRI  PRAGADA  MARKANDEYULU

B Com, DBM, PGDCA, DCCP

HYDERABAD [T S]  INDIA

mrkndyl@gmail.com

Twitter:   @mrkndyl68

+91 9951038802

 +91 8186945103

 +91 8106531738