Posted on 24 Jun, 2019 03:39 pm by MANTRI PRAGADA MARKANDEYULU (Mantri Marku)

Likes - 0 522




"చిన్ని కన్నయ్యా!" ©

 

ఎందుకురా నీ అల్లరి?

నీవే నా ఊపిరి

చూడరా ఈ బొమ్మలు

ఆడరా మైమరచి // చిన్ని కన్నయ్యా//

 

 నా కష్టాలు మరచా నీ నవ్వులలో

నా యిష్టాలు తరచా నీ పరవశంలో

గొప్ప భవిష్యత్తు నీదేనోయి

నిరంతరం నేనున్నానోయి //చిన్ని//

 

 నీ పెరిగే వయసులో

నా తరిగే జీవనంలో

జ్ఞానామృతం అందిస్తా

ఆత్మానందం చిందిస్తా//చిన్ని//

 

నీ జీవిత సాఫల్యానికి

నేనుంటా ఆధారంగా

సాధించుకో లక్ష్యాలన్నీ

సంపాదించుకో కీర్తి కిరీటాలన్నీ//చిన్ని//

____________________

MANTRI  PRAGADA  MARKANDEYULU

(Mantri Marku)

B Com, DBM, PGDCA, DCCP

HYDERABAD [T S]  INDIA

mrkndyl@gmail.com

Twitter:   @mrkndyl68

+91 9951038802

 +91 8186945103

 +91 8106531738