Posted on 24 Jun, 2019 03:28 pm by MANTRI PRAGADA MARKANDEYULU (Mantri Marku)

Likes - 0 524


అంబుజ మనసా © - Telugu Song

అంబుజ మనసా ©

(Tatwam Type song)

Singers to sing: Male and Female

==========

నీ పాదాంబుజములనే శరణంటిని //

నీ కరుణకై వేచియుంటిని,  అంబుజ మనసా //

 

ధర్మ సూక్షము లెన్నో ఎన్నెన్నో

బ్రహ్మ పాదములో - శేషశయనములో

సాగర మథనంలో,  ఋషి మనసులలో

దివి సౌదమ్ములో - వనసీమలలో //

 

నీ పాదాంబుజములనే శరణంటిని //

నీ కరుణకై వేచియుంటిని,  అంబుజ మనసా //

 

కనులలోని ఆశల చూపులలో

మనసులు కలిసిన - జంటల వలయంలో

ఆనంద జీవితపు మర్మంలో

భాష్య మర్మము కనుమా //

 

నీ పాదాంబుజములనే శరణంటిని //

నీ కరుణకై వేచియుంటిని,  అంబుజ మనసా //

 

మలి జీవితపు కాలములో,  కలి కాలములో

కల్కి మాయను గ్రహించి

ఋషి మార్గమునెంచి

జీవిత మర్మము గాంచితిని //

 

నీ పాదాంబుజములనే శరణంటిని //

నీ కరుణకై వేచియుంటిని,  అంబుజ మనసా //

 

ఈ లోకమే బ్రహ్మ మయము

ఆ నాకమే విష్ణు సన్నిధానము

ఈ జీవితపు జనన మరణములు

జగన్నాటకమేయని నర్మ గర్భముగ తెలిపిన,

నీ పాదాంబుజములనే శరణంటిని //

 

నీ కరుణకై వేచియుంటిని అంబుజ మనసా//

____________

Copy Right Song

Mantri Pragada Markandeyulu

Email: mrkndyl@gmail.com

+91-991038802 / +91-8186945103

Hyderabad-INDIA