Posted on 24 Jun, 2019 03:35 pm by MANTRI PRAGADA MARKANDEYULU (Mantri Marku)

Likes - 0 532


ఆత్మాభివందనం © - Telugu Song

ఆత్మాభివందనం ©

 

రాగాల రసికత్వంలో

రఘురామ ఈల పాటలా

ముకుందాల వేళలో

సన్నాయి రాగాలు //రాగాల //

 

మదిలోని రాగాలకు

సుస్వసరాలే చరణపల్లవులుగా

మది కదిలించే చరణగీతములకు

మనస్సుమాంజలి //రాగాల //

 

తానాల మమైకంలో

స రి గ మ లే స్వరాలుగా

పల్లవులే సమకూర్చె

అనుపల్లవులుగా మారి //రాగాల //

 

తానాల తాత్పర్యంలో

మనసు ఊగే తన్మయత్వంతో

పరిపక్వము చెందె మనస్సు

మది చేసే ఆత్మాభివందనం //రాగాల //

______________________

MANTRI  PRAGADA  MARKANDEYULU

(Mantri Marku)

B Com, DBM, PGDCA, DCCP

HYDERABAD [T S]  INDIA

mrkndyl@gmail.com

Twitter:   @mrkndyl68

+91 9951038802

 +91 8186945103

 +91 8106531738